దక్షిణాసియాలోని రెండవ కుంభమేళగా పేరుగాంచిన ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే శ్రీ మేడారం సమ్మక్క- సారక్క జాతరను గిరిజన ఆచారాలు సంప్రదాయాల బద్దంగా నిర్వహించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని డోర్నకల్ బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ , జనగామ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బేజాడి బీరప్ప గారు అన్నారు.
ఈరోజు తొలి పొద్దు వేకువ జాములో మేడారంలో సమ్మక్క -సరళక్కల గద్దెలను తన మిత్ర బృందంతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా స్థానికులతో మరియు మరియు దేవాలయ అభివృద్ధి బోర్డ్ సభ్యులతో మాట్లాడుతూ ఢిల్లీలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సమ్మక్క- సారలక్కర పేర్ల మీద గిరిజన యూనివర్సిటీతో పాటు ఆధ్యాత్మిక పర్యాటక శోభ అభివృద్ధి చెందే విధంగా టూరిజం కారిడార్‌ను అభివృద్ధి చేస్తుందని అన్నారు.