ఈరోజు జనగామ నియోజకవర్గం నర్మెట్ట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరియు మండల కేంద్రంలో పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.
అదేవిధంగా నర్మెట్ట మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ పేరుతో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మరియు పసుపు బోర్డును మంజూరు చేసినందుకు గాను గౌరవనీయులు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.






